యాప్నగరం

వైభవంగా మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. భారీగా తరలివచ్చిన భక్తులు

Kurnool జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు వైభవంగా సాగాయి. బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో లవన్న ఘనంగా ప్రారంభించారు.

Samayam Telugu 22 Feb 2022, 9:23 pm
కర్నూలు జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదటి రోజు వైభవంగా సాగాయి. బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేసి ఆలయ ఈవో లవన్న ఘనంగా ప్రారంభించారు. అర్చకులు వేదపండితులు యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి పూజ, శివసంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ప్రారంభించారు.
Samayam Telugu శ్రీశైలం బ్రహ్మోత్సవాలు


సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన పూజలు చేసిన అనంతరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ ధ్వజపట ఆవిష్కరణ బలిహరణలు మొదలగు పూజలు నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి దేవస్థానం తరుపున స్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో పెద్దిరాజు దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.