యాప్నగరం

తన భార్యని పంపించమని అడిగిన భర్త.. ఒప్పుకోని ప్రియుడు.. చివరికి..

రెండు పెళ్లిళ్లు చేసుకున్న యువకుడు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ విషయం తెలిసిన ఆమె భర్త తన భార్యను పంపించేయాలని ఎన్నోసార్లు అడిగాడు. అయినా యువకుడు ఒప్పుకోకపోవడంతో దారుణం జరిగిపోయింది.

Samayam Telugu 20 Jun 2021, 3:11 pm
ఆ యువకుడికి ఇద్దరు భార్యలు.. అయినా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన భార్యను తన వద్దకు పంపించేయమని ప్రియురాలి భర్త కోరినా పట్టించుకోలేదు. మరో ఇంట్లో ఆమెతో కాపురం పెట్టాడు. అది తెలిసి ఆగ్రహంతో రగిలిపోయిన ప్రియురాలి భర్త అర్ధరాత్రి వేళ దారుణానికి పాల్పడ్డాడు. అమాంతం వేటకొడవళ్లతో విరుచుకుపడ్డాడు. భార్య ప్రియుడిని అమానుషంగా నరికి చంపేశాడు. ఆమె ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. వివాహేతర సంబంధం మిగిల్చిన ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
affair


గోనెగండ్లకి చెందిన ఉరుకుందమ్మకి ఎమ్మిగనూర్ మండలం గుడేకల్ గ్రామానికి చెందిన బోయ నాగరాజుతో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న కాపురంలో కలహాలు రేగాయి. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె మూడేళ్ల కిందట పుట్టింటికి వచ్చేసింది. ఆమెకు అదే గ్రామానికి చెందిన బోయ బజారితో పాత పరిచయముంది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. బోయ బజారికి అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి.

మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో ఆమెకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్నాడు. అయినా ప్రియురాలితో శారీరక సంబంధం కొనసాగించాడు. గోనెగండ్ల లక్ష్మీపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ప్రియురాలితో మరో కాపురం పెట్టాడు. ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలి భర్త తన భార్యను ఇంటికి పంపించేయాలని బజారిని కోరాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె భర్త నాగరాజు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా బజారిని మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు.

తన సోదరుడు బోయ వెంకటేష్‌తో పాటు మరో ఇద్దరితో కలిసి హత్య చేసేందుకు పథకం రచించాడు. అర్ధరాత్రి వేళ ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. భార్య ప్రియుడు బజారిని వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా నరికి చంపేశారు. ఈ దాడిలో భార్యకి కూడా తీవ్రగాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోద చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.