యాప్నగరం

వరద నీటిలో కళ్యాణ మండపం.. ఐడియా అదిరింది.. పెళ్లి ఘనంగా జరిగింది!

పెళ్లి కోసం కళ్యాణ మండపం మాట్లాడుకున్నారు. ఘనంగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారితే పెళ్లి అనగా.. రాత్రి పూట భారీ వర్షం కురిసింది. దీంతో కళ్యాణ మండపం ప్రాంగణం చెరువును తలపించేలా వరద నీరు నిలిచింది. పెళ్లికి వచ్చే అతిథులకు ఇబ్బంది కావొద్దని ట్రాక్టర్ల సాయంతో పెళ్లి కానిచ్చేశారు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 31 Jul 2022, 10:30 pm
ట్రాక్టర్‌లో జనాలు ఫంక్షన్ హాల్‌కు వెళ్తున్నారేంటి అనుకుంటున్నారా..? వీళ్లెవరో వరద బాధితులు అనుకుంటే పొరబాటే.. వీరంతా పెళ్లికి హాజరవుతున్నారు. నంద్యాలలో శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో... కళ్యాణ మండపం ప్రాంగణమంతా జలమయమైంది. దీంతో ట్రాక్టర్ల సాయంతో అతిథులను ఇలా తరలించారు.
Samayam Telugu Nandyal Wedding
Nandyal Wedding


నంద్యాల పట్టణంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి కల్యాణ మండపంలో ఈశ్వర్-పద్మావతిల పెళ్లి వేడుక జరిగింది. ఇందుకోసం శనివారమే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ రాత్రి కురిసిన వర్షానికి తెల్లారి చూసే సరికి కల్యాణ మండపం చుట్టూ వర్షపు నీరు చేరి చెరువును తలపించింది.

ఎన్ని ఆటంకాలు వచ్చిన సరే పెళ్లి ఆగకూడదు, పెళ్లికి వచ్చే వారు వెనక్కి పోకూడదని అనుకున్నారు, వెంటనే స్థానికంగా ఉన్న రెండు ట్రాక్టర్లను రప్పించి పెళ్లికి వచ్చే వారిని మండపం వద్ద దించడం, పెళ్లికి హాజరైన వారిని క్షేమంగా కల్యాణ మండపం నుంచి రోడ్డు పైకి తరలించడం చకచకా జరిగిపోయాయి.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.