యాప్నగరం

గొప్ప మనుషులే కాదు.. గొప్ప మనస్సులు కూడా..!!

Samayam Telugu 27 Oct 2021, 6:47 pm
కన్నతల్లికే కూడు పెట్టని కాలం ఇది.. అలాంటిది ముక్కూ మొహం తెలియనోళ్లకి గుక్కెడు నీళ్లైనా ఇస్తారంటారా..? ఇస్తారు.. కొందరుంటారు అలాంటోళ్లు.. ఆ సాయం చేసేటోళ్లు పోలీసోళ్లయితే..? కొంచెం కష్టమే.. కానీ ఇది నిజమే..!!
Samayam Telugu నంద్యాల ట్రాఫిక్ పోలీసు


ట్రాఫిక్ పోలీసంటే.. రోడ్డుపై బండ్లనే కాదు.. రోడ్డు వెంట ఉండే అభాగ్యుల బాగోగులు కూడా చూస్తుంటారు. కళ్లతో చూడటమే కాదూ.. చేతులతో సాయం కూడా చేశారు కర్నూలు జిల్లా నంద్యాల ట్రాఫిక్ పోలీసులు.

నంద్యాల పట్టణంలో రోడ్డు డివైడర్‌పై అనాథ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయాడు. అటుగా వెళ్తున్న అందరూ అతన్ని చూస్తూ పోతున్నారే గానీ.. ఏ ఒక్కరూ సాయం చేయలేదు. సరిగ్గా ఆ సమయంలో డ్యూటీలోకి వెళ్తున్న జయకృష్ణ, మనోహర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు వృద్ధుడిని చూసి చలించిపోయారు. మంచినీళ్లు అందించి.. స్వయంగా వారి చేతుల్తోనే తినిపించి ఆకలి తీర్చారు. అంతటితో ఆగకుండా ఆటోలో నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం అందించారు. మానవత్వం చూపిన కానిస్టేబుళ్లకు స్థానికులు, వైద్యులు అభినందనలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.