యాప్నగరం

Athmakuru Result: ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితం తేలేది నేడే

ఈ నెల 23న జరిగిన ఆత్మకూరు ఉపఎన్నికలకు సంబంధించి నేడు ఫలితం వెలువడనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రానికల్లా తుది ఫలితం వెలువడే అవకాశముంది.

Authored byవీరేష్ బిళ్ళ | Samayam Telugu 26 Jun 2022, 7:31 am

ప్రధానాంశాలు:

  • నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
  • అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
  • సాయంత్రానికల్లా తుది ఫలితం వెలువడే ఛాన్స్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Image
నెల్లూరు జిల్లా ఆత్మకూరు(Athmakuru) ఉపఎన్నిక ఫలితం నేడు వెలువడనుంది. మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ నెల 23న పోలింగ్ జరిగింది. 61.75శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండగా వైసీపీ తరపున గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి పోటీ చేశారు. మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. నేడు వారి భవితవ్యం తేలనుంది.
ఆత్మకూరు శివారులోని ఆంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మొత్తం 14 టేబుళ్లపై 20 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రానికి తుది ఫలితం వెలువడనుంది.
రచయిత గురించి
వీరేష్ బిళ్ళ
వీరేశ్ బిల్లా సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ రాజకీయ, సినీ రంగాలకు చెందిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. దీంతో పాటు వీడియో టీమ్‌కు సేవలు అందిస్తున్నారు. తనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి ఆర్టికల్స్ రాశారు... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.