యాప్నగరం

చంద్రబాబు కందుకూరు సభలో అపశ్రుతి.. 8 మంది మృతి

Kandukur: టీడీపీ చీఫ్ చంద్రబాబు కందుకూరు సభ దగ్గర తీవ్ర విషాద ఘటన జరిగింది. సభ దగ్గర తొక్కిసలాట జరిగింది. మురుగు కాలువలో పడి 8 మంది కార్యకర్తలు మృతిచెందారు. పామూరులోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. అక్కడ చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగిందని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మొదట ఇద్దరు మృతి చెందగా.. ఆ తర్వాత మరో ఆరుగురు చనిపోయారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 29 Dec 2022, 9:44 am

ప్రధానాంశాలు:

  • చంద్రబాబు కందుకూరు సభలో అపశ్రుతి
  • తొక్కిసలాటలో ఎనిమిదిమంది కార్యకర్తలు మృతి
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Activists died
మృతిచెందిన కార్యకర్తలు
Kandukur: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న నెల్లూరు జిల్లా కందుకూరు సభలో తీవ్ర విషాదం జరిగింది. కార్యకర్తలు భారీగా రావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన నాయకులు గాయపడిన కార్యకర్తలను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 8 మంది మృతి చెందారు. మరో ఐదుగురు సీరియస్‌గా ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు తన ప్రసంగం ఆపేసి.. ఆసుపత్రికి వెళ్లారు.
ఆసుపత్రి దగ్గర చంద్రబాబు మాట్లాడుతూ.. కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం తన మనసు కలచివేసిందన్నారు. అమయాకులు చనిపోవడం బాధ కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇటు ఈ ఘటనపై నారా లోకేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
'కందుకూరు చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మా కుటుంబ సభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం. వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది' అని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.
చనిపోయిన వారి వివరాలు..
దేవినేని రవింద్ర
ఆత్మకూరు
కలవకురి యనాది
కొండమూడుసుపాలెం
యటగిరి విజయ
ఉలవపాడు
కకుమాను రాజా
కందుకూరు
మరలపాటి చిన కొండయ్య
అమ్మపాలెం
ఈ విషాద ఘటనపై అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విచారం వ్యక్తం చేసింది. చంద్రబాబు కందుకూరు సభలో ప్రమాదం చోటు చేసుకోవడం తీవ్ర విషాదకరం అని వైసీపీ ట్వీట్ చేసింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.