యాప్నగరం

నెల్లూరులో ప్రేమజంట విషాదం.. ప్రియురాలి మృతి

ప్రియురాలి ఇంట్లోనే జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రియురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ప్రియుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Samayam Telugu 1 Jul 2021, 4:11 pm
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమజంట ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గూడూరు పట్టణానికి చెందిన తేజస్విని, వెంకటేష్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నారు. గూడూరు టూటౌన్ అర్బన్ హెల్త్ సెంటర్‌ సమీపంలోని ప్రియురాలి ఇంట్లో ఇద్దరూ ఉరి వేసుకున్నారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే తేజస్విని చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ప్రియుడు వెంకటేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దలు నిరాకరించడమే కారణమా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే విషయం తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
couple


Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.