యాప్నగరం

చేపల కోసం వల వేశాడు.. బయటకు తీస్తే షాకింగ్..!

నెల్లూరు జిల్లాలో చేపల కోసం విసిరిన వలలో భారీ కొండ చిలువ చిక్కింది. కొండ చిలువ పొడవు దాదాపు 7 అడుగులు ఉంటుంది. దాన్ని చూసిన మత్స్యకారులు ఒక్కసారిగా హడలిపోయి.. అక్కడి నుంచి పరుగులు తీశారు.

Samayam Telugu 14 Nov 2021, 6:47 am
చేపల కోసం ఓ జాలరి వల విసిరాడు. తాడు లాగితే బరువుగా అనిపించింది. భారీ చేప చిక్కిందోమోనని సంబరపడిపోయాడు. అయితే వల బయటకు లాగితే షాక్‌కు గురయ్యాడు. భారీ చేప పడింది అనుకుంటే.. వలలో నుంచి భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
Samayam Telugu నెల్లూరు జిల్లాలో భారీ కొండ చిలువ


నెల్లూరు జిల్లాలో భారీగా వర్షలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో సోమశిల జలాశయానికి నీరు భారీగా చేరింది. జలాశయం నుంచి నీటిని కిందికి వదలడంతో పెన్నానది జోరుగా ప్రవహిస్తోంది. దీంతో సంగం వద్ద మత్స్యకారులు హుషారుగా చేపలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ జాలరి చేపల కోసం నీటిలోకి వల విసిరాడు. అయితే అందులో నుంచి భారీ కొండ చిలువ బయటకు దర్శనమిచ్చింది.

కొండ చిలువ పొడవు దాదాపు 7 అడుగులు ఉంటుంది. దాన్ని చూసిన మత్స్యకారులు ఒక్కసారిగా హడలిపోయి.. అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే అది వలలో చిక్కుకుపోవడంతో బయటకు రాలేకపోయింది. భారీ కొండ చిలువను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అనంతరం మత్స్యకారులు అందరూ కలిసి జాగ్రత్తగా వలను పట్టుకుని.. కొండ చిలువను అడవిలో వదిలేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.