యాప్నగరం

నెల్లూరు: శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తప్పిన ప్రమాదం

Seshadri Express Hot Axle అయ్యింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట సమీపంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అధికారులు మరమ్మత్తులు చేసి రైలును పింపించేశారు.. కొందరు ప్రయాణికుల్ని మరో రైలులో సర్థుబాటు చేశారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 21 Mar 2023, 12:18 pm

ప్రధానాంశాలు:

  • శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
  • బిట్రగుంట సమీపంలో హాట్ యాక్సిల్
  • మరమ్మత్తులు తర్వాత వెళ్లిన రైలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Seshadri Express
నెల్లూరు జిల్లాలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. బిట్రగుంట రైల్వే స్టేషన్‌ దగ్గర ఏసీ కోచ్‌కు ‘హాట్‌ యాక్సిల్‌’ అయ్యింది.. ఆ వెంటనే రైల్వే సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. అధికారుల పర్యవేక్షణలో రైల్వే సిబ్బంది ఆ బోగీని తొలగించారు. ఈ ఘటన తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో బిట్రగుంట స్టేషన్‌ దగ్గర జరిగింది.
శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఆ బోగీని తొలిగించిన తర్వాత.. తిరిగి ఉదయం 4 గంటల తర్వాత రైలు బెంగళూరుకు బయల్దేరింది. ఆ ఏసీ బోగీలోని కొందరు ప్రయాణికులను పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో సర్దుబాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే సిబ్బంది వెంటనే గమనించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.