యాప్నగరం

జగన్ చెప్పారని ఆనంను గెలిపించాం.. దమ్ముంటే వెంకటగిరి నుంచి పోటీ చేయాలి: నేదురుమల్లి సవాల్

Nedurumalli Ramkumar Reddy ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై మండిపడ్డారు. 2019 ఎన్నికల సమయంలో ఎన్ని మాటలన్నా సరే అధినేత జగన్ క్షమించి టికెట్ ఇచ్చారని.. తాము కూడా ఆయన మాటను గౌరవించి ఆనంను గెలిపించామన్నారు. ఇప్పుడు అన్నం పెట్టే చేతినే కాటేశారని మండిపడ్డారు. దమ్ముంటే వెంకటగిరి నుంచి పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. ఆనం ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోగానే ప్రభుత్వంపై విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఆయన చేసిన తప్పులు బయటపడుతున్నాయన్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 2 Feb 2023, 12:41 pm

ప్రధానాంశాలు:

  • ఎమ్మెల్యే ఆనంపై నేదురుమల్లి ఆగ్రహం
  • ఆయన్ను సొంత తమ్ముడే ఉతికి ఆరేశారు
  • ఆనం ఒట్టును కూడా గట్టున పెట్టారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Nedurumalli Ramkumar Reddy
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి (Anam Ramanarayana Reddy) మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ నేత, వెంకటగిరి ఇంఛార్జ్ నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. దమ్ముంటే వెంకటగిరిలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. తమ కుటుంబం 40 ఏళ్లగా వెంకటగిరి రాజకీయాల్లో ఉందన్నారు. ఆనం రామనారాయణ రెడ్డిని సొంత తమ్ముడే ఉతికి ఆరేశారని.. ఆనంను సొంత తమ్ముడే వ్యతిరేకిస్తున్నారన్నారు.
ఏడాదిన్నర నుంచి ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతుందని ఇప్పుడు అంటున్నారని.. ముందు నుంచే శ్రీధర్ రెడ్డి, ఆనంలు టీడీపీతో టచ్‌లో ఉన్నారన్నారు. వయసు మీద పడటంతో ఆనంకు బుద్ధి మందగించిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టే చేతినే కాటేసే రకం రామనారాయణ రెడ్డి అంటూ మండిపడ్డారు.

అనరాని మాటలు అనినా సరే క్షమించి వైఎస్ జగన్ బీఫామ్ ఇచ్చారని.. అధినేత చెబితేనే ఆనంను గెలిపించామన్నారు. ఆయన ఆదేశాలతో భారీ మెజార్టీతో గెలిపిస్తే.. ఒట్టును కూడా గట్టున పెట్టి హామీని గాలికొదిలిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటగిరి నక్సల్ ప్రాంతమని ఆనం మాట్లాడారని.. నియోజకవర్గ ప్రజలు నక్సలైట్లా అంటూ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో చేసిన తప్పులు బయటపడుతున్నాయని.. రాజ్యాంగేతర శక్తి అంటే ఏంటో తెలుసా అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే ఆనం ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నారు.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.