యాప్నగరం

మంత్రి గోవర్ధన్ పర్యటన.. మాజీ మంత్రి అనిల్ బహిరంగ సభ.. నెల్లూరులో ఏం జరుగుతోంది..?

ఏపీ కేబినెట్ విస్తరణతో అధికార పార్టీ విభేదాలు మెల్లిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రి ఎన్నికైన కాకాణి గోవర్ధన్ రెడ్డితో అనిల్ కుమార్‌కు కోల్డ్ వార్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది.

Samayam Telugu 16 Apr 2022, 8:10 am
నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. మంత్రివర్గ విస్తరణతో ఆ పార్టీలో అంతర్గ విభేదాలు బయటపడుతున్నాయి. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు మరోసారి మంత్రి పదవి దక్కపోవడం పట్ల ఆయన కాస్తా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రి ఎన్నికైన కాకాణి గోవర్ధన్ రెడ్డితో అనిల్ కుమార్‌కు కోల్డ్ వార్ నడుస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల మీడియా సమావేశంలో తనకు గోవర్ధన్ అన్న ఎలా సహకరించారో.. అంతకు డబుల్ సహకరిస్తానని అనిల్ కుమార్ చెప్పడం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.
Samayam Telugu నెల్లూరు


నెల్లూరు ప్రజలను కలిసేందుకు మాజీ మంత్రి గడప గడపకు అనిల్ కార్యక్రమం నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు నెల్లూరులో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. సభను విజయవంతం చేయాలని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అదేరోజు సాయంత్రం 5:30 గంటలకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సిటీకి రానున్నారు. మంత్రికి స్వాగతం పలికేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకే సమయంలో ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నేతల కార్యక్రమాలు జరగబోతుండడంతో నెల్లూరులో ఏం జరగుతోందనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మరోవైపు అనిల్‌ కుమార్‌ యాదవ్ సజ్జాపురంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గిరిధర్ రెడ్డితో సమావేశమైన విషయం తెలిసిందే. వారు దాదాపు రెండు గంటలపాటు రహస్యంగా చర్చలు జరిపారు. వీరి భేటీపై పార్టీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. అదేవిధంగా ఇటీవల కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అనిల్‌ కలిసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే నెల్లూరు వైఎస్సార్సీపీ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ మారాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.