యాప్నగరం

గ్రామ-వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

సెలవుల డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని.. సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Samayam Telugu 26 Sep 2020, 6:41 am
గ్రామ-వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.. వారికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ఉద్యోగుల తరహాలోనే వారికి 180 రోజుల ప్రసూతి సెలవులు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం రెండేళ్ల ప్రొబేషన్ కాలంలో విధులు నిర్వహిస్తోన్న గ్రామ-వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ప్రసూతి సెలవులను ఇవ్వలేదు. దీంతో వారు కూడా సెలవుల డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచారు. మహిళా ఉద్యోగుల నుంచి విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయంతో వేల సంఖ్యలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సమయంలో లబ్ది చేకూరనుంది.. వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.