యాప్నగరం

ఏపీ కరోనా కేసులు: ఆ జిల్లాలో పెరిగిన కేసులు.. రికవరీ రేటుతో ఊరట

గత 24 గంటల్లో 66,944 శాంపిల్స్ పరీక్షించగా మరో 5292 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7,36,824కు చేరింది. గడచిన 24 గంటల్లో 42మంది చనిపోయారు.

Samayam Telugu 9 Oct 2020, 5:57 am
ఏపీలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో 66,944 శాంపిల్స్ పరీక్షించగా మరో 5292 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 7,36,824కు చేరింది. గడచిన 24 గంటల్లో 42మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6128కి చేరింది. గత 24 గంటల్లో 6,120మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 6,84,930 నమోదయ్యింది. మరో 48,661మంది హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
Samayam Telugu ఏపీ కరోనా బులిటెన్


గత 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 784, తూర్పు గోదావరి జిల్లాలో 652, పశ్చిమగోదావరి జిల్లాలో 612, ప్రకాశం జిల్లాలో 591, గుంటూరు జిల్లాలో 493, కృష్ణా జిల్లాలో 399, అనంతపురం జిల్లాలో 362, కడప జిల్లాలో 323, నెల్లూరు జిల్లాలో 311, శ్రీకాకుళం జిల్లాలో 204, విశాఖపట్నం జిల్లాలో 198, విజయనగరం జిల్లాలో 188, కర్నూలు జిల్లాలో 175 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 103898 పాజిటివ్ కేసులు.. తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో కేసులు 72,529కు చేరాయి.. చిత్తూరు జిల్లాలో 68,146 కేసులు ఉన్నాయి. ఓవరాల్‌గా చూస్తే కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.. రికవరీ రేటు కూడా పెరుగుతోంది.. మరణాల సంఖ్య కూడా తగ్గింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.