యాప్నగరం

విజయవాడలో రెండు గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి

విజయవాడలో ఓ బాలుడు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయాడు. ఆడుకుంటూ వెళ్లి గోడల మధ్య చిక్కుకున్నాడు. దీంతో భయపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Samayam Telugu 7 Jun 2020, 9:37 am
ఓ ఆరేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి గోడలో ఇరుక్కున్నాడు. రెండు గోడల మధ్య చిన్నారు ఇరుక్కుపోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన కృష్ణ జిల్లా విజయవాడ భవానీపురంలో చోటు చేసుకుంది. విజయవాడ భవానీపురం లేబర్ కాలనీకి చెందిన చాట్రగడ్డ సోమయ్య కుమారుడు ఆరేళ్ల నిరంజన్ ఆడుకుంటూ ఇంటికి-పక్కింటికి మధ్య ఉన్న గోడలో ఇరుక్కు పోయాడు.
Samayam Telugu విజయవాడ సిటీ


ఆప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న తమ బిడ్డ గోడల మధ్య ఇరక్కుపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గోడల మధ్య చిక్కుకుపోవడంతో సరిగ్గా ఊపిరాడక బాలుడు ఇబ్బందులు పడ్డాడు. వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బాలుడిని క్షేమంగా బయటకు తీశారు.

ఘటనాస్థలానికి చేరుకున్న భవానీపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది ఎసై కవిత శ్రీ , హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు చలపతి సహాయక చర్యలు చేపట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి.. చాకచక్యంగా గోడ సందులోంచి బాలుడుని ప్రమాదం నుండి రక్షించారు. పోలీసులు స్పందించిన తీరుపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. చిన్నారి తల్లిదండ్రులు వారికి ధన్యవాదాలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.