యాప్నగరం

AP Corona Cases: ఏపీలో కరోనా పంజా: ఒకేసారి 75 కేసులు.. మొత్తం 722, మృతుల సంఖ్య 20

చిత్తూరు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లా 16, కృష్ణా జిల్లాలో 5, అనంతపురం జిల్లా 4, కడప జిల్లా 3, తూర్పుగోదావరి జిల్లా 2 కేసులు నమోదయ్యాయి. ఈ 75 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కు పెరిగింది.

Samayam Telugu 23 Apr 2020, 3:04 pm
ఏపీలో కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. సోమవారం కొత్తగా మరో 75 కేసులు నమోదైనట్లు తాజా బులిటెన్‌‌లో తెలియజేశారు. వీటిలో చిత్తూరు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 20, కర్నూలు జిల్లా 16, కృష్ణా జిల్లాలో 5, అనంతపురం జిల్లా 4, కడప జిల్లా 3, తూర్పుగోదావరి జిల్లా 2 కేసులు నమోదయ్యాయి. ఈ 75 కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కు పెరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 92మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 20మంది చనిపోయారు.
Samayam Telugu corona


రాష్ట్రంలో కేసుల్లో కర్నూలు జిల్లా 174 పాజిటివ్ కేసులతో టాప్‌లో ఉంది. మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా -74
గుంటూరు జిల్లా -149
కృష్ణా జిల్లా -80
నెల్లూరు జిల్లా -67
చిత్తూరు జిల్లా - 53
ప్రకాశం జిల్లా - 44
కడప జిల్లా -40
పశ్చిమ గోదావరి జిల్లా - 35
అనంతపురం జిల్లా -33
విశాఖపట్నం జిల్లా -21
తూర్పుగోదావరి జిల్లా - 26
మొత్తం కేసులు -722
(గమనిక: ఈ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 92మందికి ట్రీట్మెంట్ తర్వాత నెగిటివ్ రావడంతో డిశ్చార్జ్ అయ్యారు)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.