యాప్నగరం

ప.గో జిల్లా: కరోనాను జయించిన 95 ఏళ్ల వృద్ధుడు.. ఎలా అంటే

90 ఏళ్లు పైబడిన వాళ్లు కూడా ఆ మహమ్మారిని జయిస్తున్నారు.. వైరస్ నుంచి త్వరగానే కోలుకుంటున్నారు. ఇటీవల చాలామంది పెద్దవాళ్లు కరోనాను జయించి.. డిశ్చార్జ్ అయ్యారు.

Samayam Telugu 6 Aug 2020, 8:31 am
కరోనాతో భయపడాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండి, డాక్టర్లు అందించే వైద్యంతో కోలుకోవచ్చు. ఇదే విషయాన్ని చాలామంది నిరూపించారు. 90 ఏళ్లు పైబడిన వాళ్లు కూడా ఆ మహమ్మారిని జయిస్తున్నారు.. వైరస్ నుంచి త్వరగానే కోలుకుంటున్నారు. ఇటీవల చాలామంది పెద్దవాళ్లు కరోనాను జయించి.. డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో కూడా 95 ఏళ్ల వృద్ధుడు కోలుకున్నారు.
Samayam Telugu కరోనాను జయించాడు


వేలేరుపాడు మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన వృద్ధుడు షేక్‌ అబ్దుల్లాకు గత నెల 22న జ్వరం, ఆయాసం వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు వేలేరుపాడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ కరోనా లక్షణాలు ఉండటంతో అనుమానం వచ్చి పరీక్ష చేయించారు.. అతడికి పాజిటివ్‌ తేలింది. వెంటనే ఏలూరులోని ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు మరింత మెరుగైన వైద్యం అందించారు. ఆ వృద్ధుడు కోలుకున్నారు.. గత నెల 31న డిశ్చార్జ్‌ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.