యాప్నగరం

రోజాతో పాటు మరొకరికి మంత్రి పదవి.. స్పీకర్ తమ్మినేనికి జగన్ బంపరాఫర్!

శాసనమండలి రద్దుతో ఏపీ మంత్రివర్గ విస్తరణపై జోరుగా ఊహాగానాలు. ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి ఖాయమని ప్రచారం.. మరొకరికి కేబినెట్ బెర్త్.. స్పీకర్ తమ్మినేని సీతారాం పదవి కూడా మార్పు!

Samayam Telugu 4 Feb 2020, 2:42 pm
ఏపీలో త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగబోతోందా.. ఎమ్మెల్యే రోజాకు ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయమా.. ఆమెతో పాటూ మరో సీనియర్ నేతకు పదవి రాబోతోందా.. సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఇదే ప్రచారం జరుగుతోంది. రోజా కల త్వరలోనే నెరవేరబోతోందని.. శాసనమండలి రద్దు రూపంలో ఆమెకు అదృష్టం కలిసొస్తోందని చెబుతున్నారు.
Samayam Telugu rojaa


Read Also: జగన్ సర్కార్‌కు గుడ్‌న్యూస్.. 3 రాజధానులపై కేంద్రం కీలక ప్రకటన

రోజాకు మంత్రి పదవి అంటూ జరుగుతున్న ప్రచారం వెనుక పెద్ద లాజిక్ చెప్పుకొస్తున్నారు. శాసనమండలిని రద్దు చేస్తే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికిం పంపిచింది.. అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మండలి రద్దవుతుంది. అదే జరిగితే జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల పదవులు పోయినట్లే.

ఆ ఇద్దరికి మంత్రి పదవులు పోతే.. ఆ స్థానంలో ఇద్దర్ని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రెండు బెర్తుల్లో రోజాకు ఒకటి ఖాయమట.. మరో బెర్త్ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. స్పీకర్ పదవిని సీతారాం సొంత జిల్లాకే చెందిన సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంటే తమ్మినేని మంత్రి పదవి.. ధర్మానకు స్పీకర్ పోస్ట్ అన్నమాట. అంతేకాదు రోజాకు హోంశాఖ ఇస్తారనే ప్రచారం మొదలయ్యింది. అంతేకాదు సోమవారం రోజు ఎమ్మెల్యే రోజా డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిశారు. ఇది మర్యాదపూర్వకంగానే జరిగినా.. వారిద్దరు తాజా పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది.

రోజా చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండుసార్లు (2014, 2019)లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేబినెట్‌లో బెర్త్ ఖాయమని భావించారు. కానీ సామాజిక సమీకరణాలతో ఆమెకు పదవి దక్కలేదు. దీంతో ఆమె కాస్త అసహనానికి గురయ్యారు.. తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.