యాప్నగరం

TTD: బాబాయ్ ఒకటి తలిస్తే.. మరోటి చేసిన అబ్బాయ్.!

టీటీడీ నూతన చైర్మన్‌గా తాజా మాజీనే ఏపీ ప్రభుత్వం నియమించింది. వైవీ సుబ్బారెడ్డి మరో రెండున్నరేళ్లు అదే పదవిలో కొనసాగుతారని తెలిపింది. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా ఉండాలని కోరుకున్న వైవీకి నిరాశే ఎదురైంది.

Samayam Telugu 17 Jul 2021, 2:12 pm
బాబాయి ఒకటి తలిస్తే అబ్బాయి మరొకటి చేశారా? ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా ఉండాలనుకున్న బాబాయి స్పీడుకి బ్రేకులు వేశారా? ఇప్పటి వరకూ ఉన్న పదవిలోనే కొనసాగుతారని చెప్పడంతో బాబాయ్ ఆశలు ఆవిరయ్యాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. టీటీడీ చైర్మన్‌గా తాజా మాజీ వైవీ సుబ్బారెడ్డినే నియమించడం చర్చనీయాంశమైంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
yv subba reddy


మరోమారు చైర్మన్‌గా కొనసాగేందుకు ఆయన సుముఖంగా లేరని గతంలో ప్రచారం జరిగింది. తనను నమ్ముకున్నోళ్లకి ఏమీ చేయలేకపోయానని.. ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మారాలని కోరుకుంటున్నట్లు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇటీవల తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆ విషయం సీఎం జగన్‌‌కు వివరించానని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా నిర్వహిస్తానన్నారు. దీంతో ఆయన వైసీపీలో కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారని భావించారు.

విజయసాయి రెడ్డి విశాఖ, ఉత్తరాంధ్ర రాజకీయాలతో బిజీగా ఉండడంతో వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ వ్యవహారాలు అప్పగించే అవకాశం ఉందన్న ప్రచారం కూడా సాగింది. టీటీడీ చైర్మన్‌గా మరోమారు పనిచేసేందుకు వైవీ అయిష్టత చూపారని.. ఆయనకు మరో విధంగా కీలక బాధ్యతలు అప్పజెబుతారని వైసీపీ వర్గాలే అంచనాలు వేశాయి.

కానీ అనూహ్యంగా మరోమారు టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమించడం హాట్ టాపిక్‌గా మారింది. చైర్మన్‌గా మరో రెండున్నరేళ్లు ఆయనే కొనసాగుతారని ఈ రోజు నామినేటెట్ పోస్టుల ప్రకటన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రకటించడంతో వైవీ భవితవ్యంపై సస్పెన్స్ వీడిపోయింది. అయితే దీనిపై బాబాయి ఎలా స్పందిస్తారో చూడాలి మరి!!

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.