యాప్నగరం

నేడు ఏపీ కేబినెట్, అసెంబ్లీ.. అమరావతిలో హైటెన్షన్

ఇవాళే ఏపీ కేబినెట్, అసెంబ్లీ సమావేశాలు.. రాజధానిపై ఉత్కంఠకు తెర దించుతారా. అమరావతిలో టెన్షన్ వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు. ప్రకాశం బ్యారేజీపై ఉద్యోగులకు మాత్రమే అనుమతి. పోలీస్ యాక్ట్ 30, సెక్షన్ 144 అమలు. 5వేలమందితో భద్రత.

Samayam Telugu 20 Jan 2020, 7:46 am
ఏపీ రాజధాని వ్యవహారం తుది అంకానికి చేరింది. సోమవారం అమరావతిలో కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలతో హీట్ పెరిగింది. పాలన వికేంద్రీకరణ బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం పొందేందుకు అధికారపక్షం సిద్ధమయ్యింది. సోమవారం ఉదయం 9 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ బిల్లుపై చర్చించి.. మంత్రివర్గంలో ఆమోదించనున్నారు.
Samayam Telugu assembly.


కేబినెట్ సమావేశం తర్వాతఉదయం 10 గంటలకు బీఏసీ సమావేశం జరుగుతుంది. 11 గంటలకు అసెంబ్లీ మొదలవుతుంది.. సభలో ఈ పాలనా వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై చర్చించే అవకాశం ఉంది.. ఒకవేళ ప్రతిపక్షం అడ్డుపడితే ఎలా డీల్ చెయ్యాలనే అంశంపైనా క్లారిటీకి వచ్చేశారు. ముఖ్యమంత్రితో ప్రకటన చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది. తర్వాత మండలికి బిల్లును పంపే ఛాన్స్ ఉందట. ప్రభుత్వం కూడా పరిస్థితులకు తగ్గట్లుగా మూడు రోజుల పాటూ అసెంబ్లీ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

హైపవర్ కమిటీ నివేదికలో ఎలాంటి విషయాలను పొందుపరిచారనే అంశంపైనా ఉత్కంఠరేపుతోంది. మూడు రాజధానులు ఖాయమనే ప్రచారం జరుగుతోంది.. ఈ అంశాన్ని పక్కన పెడితే. అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న రైతుల సంగతేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వారికి ఎలాంటి హామీ ఇస్తారు.. ప్రత్యేకంగా ప్యాకేజీ ఏదైనా ప్రకటిస్తారా అనే చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉంటే అమరావతి పరిరక్షణ జేఏసీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.. ఎలాంటి అనుమతులు లేవని.. 144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు రైతులు, విపక్ష పార్టీల నేతలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలకు అనుమతులు లేవని.. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీడీపీ నేతల్ని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఎన్ని అరెస్ట్‌లు చేసినా.. అసెంబ్లీని ముట్టడిస్తామని విపక్ష పార్టీలు, జేఏసీ నేతలు చెబుతున్నారు.

ఇటు అమరావతి ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు.. దాదాపు 5వేలమంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. సెక్రటేరియట్, అసెంబ్లీ దగ్గర సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో కూడా పోలీసుల్ని భారీగా మోహరించారు. ఇటు ప్రకాశం బ్యారేజీపైన కూడా ఆంక్షలు విధించారు.. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎవర్నీ అనుమతించేది లేదని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.