యాప్నగరం

రాజధాని రణభేరి.. 250వ రోజుకు అమరావతి ఆందోళనలు

అమరావతి ఆందోళనలు 250 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ రైతులు మరిన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇవాళ రాజధాని రణభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Samayam Telugu 23 Aug 2020, 10:36 am
ఏపీ రాజధానిగా అమరావతి కోసం రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్నదాతలు, మహిళలు చేపట్టిన ఆందోళనలు ఆదివారం నాటికి 250 రోజులకు చేరాయి. దీంతో ఇవాళ రాజధాని రణభేరి పేరుతో రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలకు దిగారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా... ఏపీ రాజధాని అమరావతిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కరోనా సమయంలోను నిరసనలు కూడా రైతులు ఆందోళనలు ఉద్రిక్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజధాని గ్రామాల రైతులు, రైతు కూలీలు, మహిళల నిరసనలు చేపట్టారు.
Samayam Telugu అమరావతి ఆందోళనలు
amaravathi protest


రాజధాని గ్రామాలైన మందడం, తుళ్లూరు, వెలగపూడి, ఉద్దండరాయనిపాలెం, లింగాయపాలెం, దొండపాడు, పెదపరిమి, నెక్కళ్ళు, పొన్నెకళ్ళు, కిష్టయపాలెం, ఎర్రబాలెం, వెంకటపాలెం,రాయపూడి, తాడికొండ అడ్డరోడ్డు,నేలపాడు, ఐనవోలు, శాఖమూరు తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పేవరకు తమ ఆందోళనలు ఆపేది లేదంటూ రాజధాని రైతులు స్పష్టం చేశారు. ఆదివారం నాటికి 250వ రోజుకి ఉద్యమం చేరడంతో అమరావతి జేఏసీ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది. 250వ రోజు కార్యక్రమం పేరు రాజధాని రణభేరిగా పేరు పెట్టింది.
Read More: ఏపీలో ఆ జిల్లాలో ఇవాళ సంపూర్ణ లాక్ డౌన్
అన్ని దీక్షా శిబిరాలలో డప్పులు, పళ్ళెము గరిట మ్రోగించటం ద్వారా రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు 250వ రోజుకు చేరిన సందర్భంగా ఇవాళ అనేక రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రతి శిబిరం వద్ద కాగడాల ప్రదర్శన చేపట్టనున్నారు ఆందోళనకారులు. 5 కోట్ల ఆంధ్రుల వెలుగు అనే పేరుతో నిరసన కార్యక్రమాలు ఉంటాయని అమరావతి జేఏసీ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.