యాప్నగరం

అమరావతి రైతు ఆత్మహత్యా యత్నం.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..

రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో అమరావతి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది.

Samayam Telugu 26 Dec 2019, 5:16 pm
ఏపీకి మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రైతుల ఆందోళనలు తీవ్ రూపం దాల్చుతున్నాయి. రాజధాని తరలింపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాజాగా ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అమరావతిలో కలలకం రేపింది. రాజధాని ప్రాంతానికి చెందిన ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడం అలజడి రేపింది. పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Samayam Telugu amaravati


రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో అమరావతి రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన రైతు రమేష్ బలవన్మరణానికి యత్నించాడు. తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది తక్షణం స్పందించి రమేష్‌ను అడ్డుకున్నారు. వెంటనే రైతు రమేష్‌పై నీళ్లు పోసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Also Read: ఆ రెండు కులాల పిచ్చి ఘర్షణ.. రాజధానిపై బైరెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద భూమి ఇచ్చిన రమేష్.. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనలతో మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. తన నాలుగెకరాల భూమి రాజధాని ఇచ్చానని.. ఇప్పుడు రాజధాని తరలిస్తామంటున్నారని రైతు రమేష్ వాపోయాడు.

ఇదిలా ఉంటే.. రేపు జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించేందుకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏపీ రాజధాని వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుండడంతో.. అమరావతి రైతులకు ఎలా న్యాయం చేస్తారన్న విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also: విశాఖకు భారీగా నిధులు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.