యాప్నగరం

ఏపీ మూడు రాజధానుల గెజిట్ నిలిపివేతపై హైకోర్టులో పిటిషన్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యాహ్నం లంచ్ మోషన్‌లో పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.

Samayam Telugu 4 Aug 2020, 11:56 am
ఏపీలో మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటీషన్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు విచారణకు అంగీకరించింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పిటీషన్‌పై విచారించనున్నారు. సాంబశివరావు, శ్రీనివాసరావు అనే రైతులు హైకోర్టులో మూడు రాజధానుల గెజిట్ నిలిపివేయాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. గవర్నర్ ఆమోదించిన గెజిట్ నోటిఫికేషన్ నిలుపదల చేయాలని కోరుతూ రైతులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
Samayam Telugu ఏపీ హైకోర్టు
ap high court


మరోవైపు హైకోర్టులో మంగళవారం సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులపై విచారణ చేపడుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు న్యాయమూర్తులకు దండం పెడుతూ వారు వెళ్లే మార్గంలో మానవహారంగా నిలుచున్నారు. వెంటకపాలెం, మందాడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయపాలెం గ్రామస్తులు రోడ్డుపై నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు. కిలోమీటర్ల మేర రైతులు నిలుచున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను, రైతులను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని మహిళా రైతులు అన్నారు. త్యాగాలు చేసిన రైతులను ప్రభుత్వం రోడ్డుపై నిలుచోబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read More: ఏపీలో మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
మరోవైపు తాజాగా జులై 31న ఏపీ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లుకు కూడా గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ హరిచందన్ ఆమోదం తెలపడంతో ఇకపై విశాఖపట్నం అధికారికంగా పరిపాలనా రాజధాని కానుంది. అలాగే, అమరావతి శాసన రాజధాని కానుంది. కర్నూలుకు హైకోర్టు తరలివెళ్లనుంది. ఆగస్టు 15 వరకు అన్ని కార్యాలయాలను విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.