యాప్నగరం

అమరావతికే నా మద్దతు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుందని.. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారన్న ఆయన.. అమరావతి గొప్ప చారిత్రక ప్రాంతమన్నారు.

Samayam Telugu 24 Sep 2020, 1:48 pm
ఏపీ రాజధాని విషయంలో అమరావతి రైతుల డిమాండ్‌ న్యాయమైందంటున్నారు కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే. గురువారం అమరావతి జేఏసీ మహిళా నేతలు, రైతులు కేంద్రమంత్రిని కలవగా.. వారికి మద్దతు ఇచ్చారు. అమరావతి రాజధానికి తన మద్దతు ఉంటుందని.. పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేశారన్న ఆయన.. అమరావతి గొప్ప చారిత్రక ప్రాంతమన్నారు. ఈ అంశంపై ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాస్తానని చెప్పారు. మహిళా జేఏసీ సభ్యులు అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయన్ని వివరించారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును వివరించి వినతిపత్రం అందజేశారు.
Samayam Telugu అమరావతికి మద్దతు


అమరావతి మహిళా జేఏసీ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అమరావతికి జాతీయ నేతల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు. వివిధ పార్టీల ఎంపీలను కలిసి వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తున్నార. రాజధాని అమరావతిలోనే కొనసాగించేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీల్ని కలిసి మద్దతు కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.