యాప్నగరం

ఏపీలో ఈనెల 15 నుంచి వర్షాలు.. రైతులకు హెచ్చరిక!

ఏపీలో ఈ నెల 15వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 11 Mar 2023, 11:10 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 15 నుంచి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బిహార్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌, విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు కొనసాగుతున్న పశ్చిమ ద్రోణి ఈ నెల 15వ తేదీ నాటికి తూర్పు వైపుగా పయనించనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో పడమర దిశ నుంచి వచ్చే గాలులు, బంగాళాఖాతం మీదుగా వీచే తూర్పుగాలుల కలయికతో ఈ నెల 15వ తేదీ నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, విదర్భ తదితర ప్రాంతాల్లో పిడుగులు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


మరోవైపు, పశ్చిమ ద్రోణి మరింత బలపడే అవకాశం ఉన్నందున ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వరి, మిరప, ఇతర పంటలకు వర్షం వల్ల నష్టం వాటిల్లకుండా చూసుకోవాలని రైతులకు సూచించింది.

సాధారణంగా మార్చి నుంచి ఏప్రిల్‌ వరకు పశ్చిమ ద్రోణుల ప్రభావంతో మధ్య భారతం, దానికి ఆనుకుని ఏపీ, తెలంగాణలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ వర్షాల వల్ల పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, కాబట్టి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.