యాప్నగరం

ఏపీకి వర్ష సూచన, తీవ్రమైన చలి.. ఈ ప్రాంతాల ప్రజలకు అలర్ట్!

ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోయేది అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. ఈ మేరకు మంగళవారం రిపోర్ట్ విడుదల చేసింది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 29 Nov 2022, 6:19 pm
ఆంధ్రప్రదేశ్‌లో శీతాకాలం మొదలైపోయింది. ఓవైపు తీవ్రమైన చలితో ప్రజలు వణికిపోతుంటే.. మరోవైపు వర్ష సూచనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా, అమరావతి వాతావరణ కేంద్రం మరో మంగళవారం హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరికొన్ని చోట్ల తీవ్రమైన చలి ఉంటుందని తెలిపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అమరావతి వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాంల్లో దిగువ ట్రోపోస్పిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా ఆయా ప్రాంతాల్లో తీవ్రమైన చలి ఉంటుంది. మరొకొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి.

3 రోజులకు సంబంధించి ఏపీలో వాతావరణ వివరాలు..
ఉత్తర కోస్తాంధ్రలో మంగళవారం, బుధ, గురువారాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఇక దక్షిణ కోస్తాంధ్రాలో మంగళ, బుధవారాల్లో పొడి వాతావరణం ఉంటుంది. గురువారరం తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

రాయలసీమ..ఇక, రాయలసీమ ప్రాంతంలో మంగళ, బుధవారం పొడి వాతావరణం ఉంటుంది. గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.