యాప్నగరం

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ.. ఈసారి వినూత్నంగా!

కరోనాతో 16న ఉదయం రాజ్‌భవన్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 16న గవర్నర్‌ ప్రసంగం, బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌, వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Samayam Telugu 12 Jun 2020, 6:37 am
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 16 నుంచి బడ్జెట్ సెషన్స్ మొదలుకానున్నాయి. కరోనా వ్యాప్తితో తక్కువ రోజుల్లోనే సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 16, 17న సభను నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ వరకు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, ఆమోదించడం ప్రక్రియనంతా రెండ్రోజుల్లో ముగించాలని భావిస్తున్నారట. శాసనమండలిలో మూడో రోజు బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు.
Samayam Telugu ఏపీ అసెంబ్లీ


కరోనా వ్యాప్తి ప్రభావంతో రెండు సభల సభ్యులు ఒకే ప్రాంగణంలో సమావేశమైతే భౌతిక దూరం పాటించడం వీలు కాదని.. నియంత్రణ చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటిస్తూ సమావేశాలు జరుపుకోవాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీలు మండలిలోనూ, ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనూ సమావేశమయ్యేలా ప్రణాళిక రూపొందింస్తున్నట్లు తెలుస్తోంది.

16 నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అధికారికంగా ప్రకటన జారీ చేశారు. కరోనాతో 16న ఉదయం రాజ్‌భవన్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారట. 16న గవర్నర్‌ ప్రసంగం, బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌, వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 17న బడ్జెట్‌పై చర్చతోపాటు బిల్లును ఆమోదించే అవకాశం ఉందట. 18న ఈ రెండు బడ్జెట్ల పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లును శాసనమండలిలో ఆమోదించనున్నారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.