యాప్నగరం

ఏపీ బీజేపీ సంచలనం.. ఆ న్యూస్ ఛానల్‌‌‌ బహిష్కరిస్తూ నిర్ణయం

ఆ ఛానల్, పేపర్‌పై బుధవారం నుంచి బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నుంచి జరిగే పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని, ఆ టీవీ ఛానల్‌లో జరిగే చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు.

Samayam Telugu 25 Feb 2021, 9:40 am

ప్రధానాంశాలు:

  • ఏపీ బీజేపీ అధికారికంగా ప్రకటన
  • క్షమాపణలు చెప్పే వరకు బహిష్కరణ
  • ఇటీవల జరిగిన పరిణామంతో నిర్ణయం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏపీ బీజేపీ
ఏపీ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు న్యూస్ ఛానల్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన పరిణామాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ ఛానల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై జరిగిన దాడితో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జి వుల్లూరి గంగాధర్ తెలిపారు. టీడీపీ ప్రయోజనాల కోసం దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేయించకుండా.. తిరిగి అతడ్ని రోజు చర్చకు ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు.
ఆ ఛానల్, పేపర్‌పై బుధవారం నుంచి బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక నుంచి జరిగే పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు ఆహ్వానించరాదని, ఆ టీవీ ఛానల్‌లో జరిగే చర్చా కార్యక్రమాల్లో బీజేపీ ప్రతినిధులు పాల్గొనరాదని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర బీజేపీ ఈ అధికారిక నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ ఆ ఛానల్ తమకు నచ్చిన వారిని డిబేట్‌ల పేరుతో ఆహ్వానించి.. వారి వాయిస్‌ను పార్టీ వాయిస్‌గా ప్రచారం చేసి ప్రజల్ని మోసం చేయాలని చూస్తే ఆ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని ప్రకటించారు. ఆ ఛానల్ యాజమాన్యం బేషరతుగా క్షమాపణ చెప్పేవరకు ఈ బహిష్కరణ కొనసాగుతుందన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.