యాప్నగరం

ఈ నెల 11న ఏపీ కేబినెట్ సమావేశం.. సీఎస్ కీలక ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు.

Samayam Telugu 3 Jun 2020, 1:43 pm
ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ నెల 11న ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేబినేట్‌ సమావేశంలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని అన్ని శాఖల అధికారులను సీఎస్‌ ఆదేశించారు. కరోనా కట్టడితో పాటూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
Samayam Telugu ఏపీ కేబినెట్ భేటీ


ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా.. లాక్‌డౌన్‌ అమలు,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కీలకంగా చర్చించనున్నారు. పోతిరెడ్డి వివాదం, నిమ్మగడ్డ రమేష్ వివాదాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి ప్రతి నెల రెండో, నాలుగో బుధవారాల్లో మంత్రివర్గ సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ కరోనా, లాక్‌డౌన్ ప్రభావంతో సమావేశాలు నిర్వహించడం ఇబ్బందిగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.