యాప్నగరం

సీఎం జగన్‌పై దాడి కేసు.. రాయి విసిరిన యువకుడి గుర్తింపు?.. అతడి వివరాలివే!

Ys Jagan Stone Attack Case Accused Arrest: విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే ఈ కేసులో తాజాగా ఐదుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ఓ యువకుడు రాయితో దాడి చేసినట్లు సమాచారం.. ఈ ఐదుగురు యువకులు వివేకానంద స్కూల్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అధికారికంగా ఇంకా పోలీసులు ప్రకటన చేయలేదు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 16 Apr 2024, 11:28 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్.. ఐదుగురు అనుమానిత యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరంతా విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందినవారిగా గుర్తించారు. వీరిలో సతీష్‌ కుమార్ అలియాస్ సత్తి అనే యువకుడు సీఎం జగన్‌పై రాయితో దాడి చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
Samayam Telugu Ys Jagan
వైఎస్ జగన్‌పై దాడి కేసులో పురోగతి


సతీష్‌తో పాటుగా ఆకాష్, చిన్న, సంతోష్, దుర్గారావులు ఉన్నట్లు చెబుతున్నారు. సతీష్ సీఎం జగన్‌పైకి ఫుట్‌పాత్ కోసం ఉపయోగించే టైల్స్ ముక్కను విసిరినట్లు సమాచారం. దాడి వెనుక ఉన్న కారణాలపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సీసీఎస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

పోలీసులు టీమ్‌లుగా విడిపోయి.. శనివారం రాత్రి నుంచి వరుస దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ సుమారుగా 70మందిని ప్రశ్నించారు.. సీసీ టీవీ ఫుటేజ్‌లను సైబర్ ల్యాబ్స్‌కు పంపారు. వీరిలో కొందరు మైనర్లు ఉన్నట్టు తెలుస్తోంది.. వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి ప్రాంతాన్ని పోలీసులు జల్లెడపట్టారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.