యాప్నగరం

మెదక్ ఎస్పీ చందనా దీప్తి వివాహానికి హాజరైన ఏపీ సీఎం జగన్

Medak SP Chandana Deepthi| మెదక్ ఎస్పీ చందనా దీప్తి-పారిశ్రామిక వేత్త బలరాం రెడ్డి విహానికి హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు.

Samayam Telugu 18 Oct 2019, 10:27 pm
మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి-ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాంరెడ్డి వివాహానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. హైదరాబాద్ తాజ్‌కృష్ణలో జరిగిన వివాహ వేడుకలో నూతన దంపతుల్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి-భారతి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహానికి జగన్ సోదరి షర్మిల కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు ముఖ్యమంత్రి జగన్‌తో పాటూ తెలంగాణకు చెందిన రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు వరుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బలరాం రెడ్డి ఏపీ సీఎం జగన్‌కు బంధువు కూడా అవుతారు.
Samayam Telugu సీఎం జగన్


Read Also: ఏపీ: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు శుభవార్త.. అవుట్‌ సోర్సింగ్ కొర్పొరేషన్ ఏర్పాటు
చందనా దీప్తి వివాహ వేడుకకు హాజరయ్యే ముందు.. జగన్ హైదరాబాద్ ఫోర్ట్‌ గ్రాండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష రెడ్డి నిశ్చితార్థ వేడుకకు కూడా హాజరయ్యారు. నూతన జంటను జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ఉదయం బిజీ షెడ్యూల్ ఉన్నా.. అన్ని పనులు ముగించుకొని శుభకార్యాలకు హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్ వచ్చారు.

మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి-యువ పారిశ్రామిక వేత్త బలరాంరెడ్డిలు తమ వివాహానికి హాజరుకావాలని కొద్దిరోజుల క్రితమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి ఆహ్వానించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటూ మంత్రులు, అధికారుల్ని స్వయంగా ఆహ్వానం పలికారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.