యాప్నగరం

అంతర్వేది ఘటనపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం లేఖ రాసింది. ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.

Samayam Telugu 11 Sep 2020, 6:10 am
తూర్పుగోదావరి అంతర్వేది ఘటనపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. లక్ష్మీనరసింహస్వామి దివ్య రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్ర హోంశాఖకు.. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ డీజీపీ కార్యాలయం లేఖ పంపింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయమై ఇవాళ ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.
Samayam Telugu సీఎం జగన్


గత శనివారం (సెప్టెంబర్ 5) అర్ధరాత్రి దాటాక రథం దగ్ధమైంది. సుమారు 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అలాంటి రథం దగ్ధం కావడంతో రాష్ట్రంలో రాజకీయంగానూ దుమారం రేగింది.. హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రథం దగ్ధం వెనుక కుట్ర కోణం ఉందని.. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ వినింపించింది. దీంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ లేఖపై స్పందించి.. సీబీఐ విచారణ కోసం రంగంలోకి దిగే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.