యాప్నగరం

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఇద్దరు మృతి

ఏపీలో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అలాగే కరోనా మరణాలు రెండు నమోదయ్యాయి.

Samayam Telugu 12 Jan 2021, 8:21 pm
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా పెంచగా, కేసుల్లో కూడా పెరుగుదల నమోదైంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు రెండు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 40,986 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 197 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,85,234కి చేరింది.
Samayam Telugu కరోనా పరీక్షలు


అలాగే, కరోనా మహమ్మారి బారిన పడి మంగళవారం ఇద్దరు మృతి చెందారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు కరోనా మహమ్మారి వల్ల మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 7,133కి చేరింది.

అలాగే రాష్ట్రంలో డిశ్చార్జిల సంఖ్య కూడా స్వల్పంగా పడిపోయాయి. కరోనా మహమ్మారి నుంచి సోమవారం మొత్తం 234 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 8,75,690 మంది కరోనా మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,411కు పడిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,23,96,593 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, సోమవారం అత్యధికంగా కృష్ణా జిల్లాలో కరోనా కేసులు నమోదు కాగా, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో సోమవారం కేసులు సున్నాకు పడిపోగా, మంగళవారం మళ్లీ మూడు కేసులు వచ్చాయి. అలాగే కర్నూలు జిల్లాలో కూడా 3 కేసులు నమోదయ్యాయి. ఇక, విజయనగరం జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు రాష్ట్రంలోనే అత్యల్పంగా 27 ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.