యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్.. విద్యుత్ బిల్లు చెల్లించకపోయినా!

గృహ, పారిశ్రామిక విద్యుత్తు వినియోగదారులు ఏప్రిల్‌లో చెల్లించాల్సిన బిల్లు చెల్లించకున్నా సరఫరా నిలిపేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం. లాక్‌డౌన్‌ కావడంతో కొన్ని సమస్యలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.

Samayam Telugu 18 Apr 2020, 1:13 pm
కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్‌తో విద్యుత్ బిల్లుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత మార్చి బిల్లును ఏప్రిల్‌కు చెల్లిస్తే సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు అధికారులు. అయితే తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యుత్ శాఖ మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నట్లు తెలుస్తోంది. గృహ, పారిశ్రామిక విద్యుత్తు వినియోగదారులు ఏప్రిల్‌లో చెల్లించాల్సిన బిల్లు చెల్లించకున్నా సరఫరా నిలిపేయకూడదని నిర్ణయించినట్లు సమాచారం. లాక్‌డౌన్‌ కావడంతో కొన్ని సమస్యలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.
Samayam Telugu power


సాధారణంగా కరెంట్ బిల్లు వచ్చిన రోజు నుంచి 14 రోజుల్లో చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా బిల్ చెల్లించకపోయినా. కాస్త ఆలస్యమైనా రీకనెక్షన్‌ ఛార్జీలను వసూలు చేస్తారు. వారం రోజుల తర్వాత విద్యుత్ సరఫరాను నిలిపివేస్తారు. లాక్‌డౌన్ సమయం కావడంతో ఏపీ విద్యుత్ శాఖ ఈ నిబంధనల్ని కాస్త స‌డలించింది. కరెంట్ బిల్లుల్ని ఆలస్యంగా చెల్లించిన వినియోగదారుల నుంచి జరిమానా వసూలు చేయకూడదని అధికారులు భావిస్తున్నారు. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని విద్యుత్‌శాఖలో పనిచేసే ఓ అధికారి తెలిపారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.