యాప్నగరం

వాహనదారులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్!

కరోనా నేపథ్యంలో రోడ్డు ట్యాక్స్ కట్టేందుకు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే కరోనా, లాక్‌డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, టాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Samayam Telugu 31 Jul 2020, 1:03 pm
ఏపీలో వాహనదారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. మరోసారి రోడ్డు ట్యాక్స్ కట్టేందుకు గడువు పెంచాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో రోడ్డు ట్యాక్స్ కట్టేందుకు ఇచ్చిన గడువు శుక్రవారంతో ముగియనుంది. అయితే కరోనా, లాక్‌డౌన్ కారణంగా నష్టాల్లో ఉన్న ఆటో, టాక్సీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్ని నాని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రోడ్డు ట్యాక్స్ గడువు సెప్టెంబర్ నెలాఖరు వరకు పెంచాలని భావిస్తోంది. సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వనుంది.
Samayam Telugu సీఎం జగన్


లాక్‌డౌన్ సమయంలో మోటార్ వెహికల్ ట్యాక్స్ గడువును చెల్లించేందుకు గ్రేస్ పిరియడ్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ చెల్లింపు గడువును జూన్ 30 వరకు పొడిగిచింది. ఏప్రిల్‌ 30తో ట్యాక్స్ చెల్లింపునకు గడువు పూర్తి అవుతుంది.. మళ్లీ ఆ గడువును పెంచారు. వెహికల్ ట్యాక్స్ అడ్వాన్స్‌గా చెల్లిస్తుంటారు.. ప్రతి త్రైమాసికానికి ఈ చెల్లింపులు చేయాలి. సకాలంలో వెహికల్ ట్యాక్స్ చెల్లించని పక్షంలో జరిమానా విధిస్తారు. అదికూడా 50 శాతం నుంచి 200 శాతం వరకు ఉంటాయి. లాక్‌డౌన్ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ట్యాక్స్ చెల్లింపుల విషయంలో వెసులుబాటు కల్పించాలని విన్నపాలు వచ్చాయి. లాక్‌డౌన్ పరిస్థితులను, వారి విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. వాహనదారులకు స్వల్ప ఊరట కల్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.