యాప్నగరం

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్

2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేశారు.

Samayam Telugu 7 Nov 2020, 11:08 am
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కరవు భత్యాన్ని (DA) నిలిపివేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ధరలకు అనుగుణంగా చెల్లించాల్సిన కరవు భత్యాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 2021 జులై వరకు చెల్లింపులతో పాటు 2021 జనవరి నుంచి చెల్లించాల్సిన కరవు భత్యాన్ని (DA) కూడా నిలిపివేస్తున్నట్లు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Samayam Telugu ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు షాక్


కొవిడ్‌, లాక్‌డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా ఆదాయం పడిపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేంద్రం జూలై 2021 వరకు డీఏ చెల్లింపు నిలిపేసింది. రాష్ట్రం కూడా అదే పరిస్థితిలో ఉండటంతో కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.