యాప్నగరం

గోదావరి జిల్లాలకు జగన్ సర్కార్ శుభవార్త

గోదావరి వరద బాధితులకు పరిహారం అందించేందుకు నిధులు విడుదల. ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి పరిహారం కింద రూ.10కోట్లు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. ఇళ్లు ధ్వంసమైన వారికి రూ.5వేల చొప్పున సాయం.

Samayam Telugu 11 Sep 2019, 8:29 pm

ప్రధానాంశాలు:

  • తక్షణ సాయం కింద నిధులు
  • జిల్లా కలెక్టర్ల నుంచి సిఫార్సులు
  • సిఫార్సుల్ని బట్టి నిధుల విడుదల
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu జగన్.
ఉభయ గోదావరి జిల్లాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. పరిహారం కింద గోదావరి జిల్లాలకు రూ. 10 కోట్లు నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఈ నిధుల్లో రూ. 7,21,75,000 తూర్పు గోదావరి జిల్లాకు కేటాయించగా.. రూ. 2,87,45,000 పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించింది. అధికారులు ఈ పరిహారాన్ని వరద బాధితులకు త్వరలోనే అందజేయనున్నారు.
వరద బాధితులను తక్షణమే ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్లు ఇచ్చిన సిఫార్సులతో ఈ నిధులు విడుదల చేశారు. గోదావరి వరదల కారణంగా ఇళ్లు నష్టపోయిన కుటుంబాలకు రూ. 5వేల చొప్పున సాయం అందజేసేందుకు నిధులు కేటాయించారు. నిబంధనలకు అనుగుణంగా ఈ సాయం అందుకునే లబ్ధిదారుల పూర్తి వివరాలు సేకరించి.. ప్రభుత్వానికి పంపాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. వరదల కారణంగా నష్టపోయిన బాధితులను గుర్తించి వారికి సాయం అందజేయాలని ప్రభుత్వం సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.