యాప్నగరం

ఏపీలో మరిన్ని సడలింపులు.. మార్గదర్శకాలు విడుదల

కంటోన్మెంట్‌లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అన్ని షాపులు తెరుచుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, పాల దుకాణాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేందుకు మాత్రమే అవకాశం.

Samayam Telugu 14 May 2020, 11:47 am
ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్ సండలింపులకు సంబంధించి మరికొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలోని షాపులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కంటోన్మెంట్ జోన్లలో తప్ప అన్ని జోన్లలో షాపులు తెరుచుకునేందుకు ఓకే చెప్పింది. కంటోన్మెంట్ జోన్ల పరిధుల్లో షాపులను జిల్లా యంత్రాంగం చెప్పేవరకు తెరవకూడదని.. తెరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవవని హెచ్చరించింది. కంటోన్మెంట్‌లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అన్ని షాపులు తెరుచుకోవచ్చు.
Samayam Telugu ఏపీలో సడలింపులు


పండ్లు, కూరగాయలు, పాల దుకాణాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేందుకు మాత్రమే అవకాశం కల్పించారు. ఇక షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, మార్కెట్ కాంప్లెక్స్‌లు తెరవకూడదు. వస్త్ర, నగలు, చెప్పుల షాపులకు కూడా అనుమతి లేదు. పట్టణాల్లో సరి బేసి విధానాల్లో షాపులు తెరిచేందుకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అతి తక్కువ పాజిటివ్ కేసులు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లలో నిత్యావసర సరుకులు షాపులకు అనుమతి ఇచ్చారు.

షాపుల ముందు ఆరడుగుల భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే.. షాపుల ముందు సర్కిల్స్ ఉండాలి. వినియోగదారులు, అమ్మకం దారు మాస్కు తప్పనిసరిగా ధరించాలి. షాపుల దగ్గర కచ్చితంగా శానిటైజర్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో ప్రస్తావించింది. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.