యాప్నగరం

ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో గుడ్‌న్యూస్

పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదును జమ అవుతుందంటున్నారు. ఆధార్‌ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిన డబ్బు జమకానుంది. తర్వాత రైతుల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు.

Samayam Telugu 24 Apr 2020, 8:06 am
ఏపీ రైతులకు జగన్ సర్కార్ మరో తీపి కబురు అందించింది. రాష్ట్రంలో గతేడాది సెప్టెం బర్‌ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారాన్ని శుక్రవారం చెల్లించనుంది. 67,874 మందికి లబ్ది చేకూరనుందని వ్యవసాయ శాఖ తెలిపింది. పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదును జమ అవుతుందంటున్నారు. ఆధార్‌ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిన డబ్బు జమకానుంది. తర్వాత రైతుల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు.
Samayam Telugu cm


Read Also: సీఎం జగన్‌పై అసభ్య పోస్ట్‌లు.. మహిళా హోంగార్డుతో పాటూ భర్త అరెస్ట్

వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయాలన్నారు ఏపీ సీఎం జగన్. రైతులు పండించిన పంటలకు కచ్చితంగా సరైన ధర లభించాల్సిందేనని తేల్చి చెప్పారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. రైతులకు సంబంధించిన శాఖలన్నీ సమన్వయంతో చర్యలను తీసుకోవాలన్నారు. రైతు పండించిన పంటకు సరైన ధర రాకపోతే.. మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా కచ్చితంగా అలర్ట్‌ రావాలన్నారు. ధరల స్థిరీకరణ నిధి రైతులకు అండగా నిలబడుతుందన్నారు.

Also Read: శ్రీకాళహస్తిలో ఓ ఏఎస్‌ఐ, ఐదుగురు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్

ప్రజలకు నిత్యావసరాలు అందుబాటులోకి తెచ్చేందుకు కొన్ని మార్కెట్లను వికేంద్రీకరించామన్నారు. వీటిని పూర్తి స్థాయిలో మ్యాపింగ్‌ చేసి.. భవిష్యత్తులో కూడా వాటిని నిర్వహించేలా చూడాలన్నారు సీఎం. ప్రస్తుతం గుర్తించిన దుకాణాలకు భవిష్యత్తులో కూడా నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు పంపి ణీ చేస్తే.. దీని వల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగు తుందన్నారు. రైతుల ఉత్పత్తులను ప్రజల ముంగిటకే తీసు కెళ్లడానికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుందన్నారు. అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ప్రతిరోజూ తమ గ్రామంలోని పంటలు, ఉత్పత్తులు, వాటి ధరలపై సమాచారాన్ని ట్యాబ్‌ ద్వారా నిరంతరం యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.