యాప్నగరం

Andhra Government: అమరావతిలో ఆ భూములు కొన్నవారికి షాక్.. జగన్ సర్కార్ జీవో

అమరావతికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్. అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలుదారులకు షాక్.. ల్యాండ్‌ పూలింగ్ ప్రయోజనాలు వారికి వర్తించదంటూ జీవో.

Samayam Telugu 19 Dec 2019, 10:08 am
ఏపీలో రాజధానిపై రగడ కొనసాగుతోంది. మూడు రాజధానులపై అమరావతి రైతులు భగ్గుమంటున్న సమయంలోనే ప్రభుత్వం మరో కీలక జీవోను జారీ చేసింది. అమరావతిలో అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలుదారులకు ప్రభుత్వం షాకిచ్చింది.. ల్యాండ్‌ పూలింగ్ ప్రయోజనాలు వారికి వర్తించదంటోంది. గతంలో వారికి కేటాయించిన ప్లాట్లు రద్దు చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.. అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేయడం చెల్లదని సర్కార్ తెలిపింది. అసైన్డ్ ల్యాండ్స్ హక్కుదారులకే ప్లాట్ల కేటాయింపునకు నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu cm.


Read Also:అమరావతిలో రైతుల బంద్.. 144 సెక్షన్ అమలు

రాజధాని ప్రకటను ముందు అమరావతిలో కొంతమంది అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు.. తర్వాత ఆ భూముల్ని ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వానికి ఇవ్వగా.. వారికి ప్లాట్లు కేటాయించారు. అయితే అసైన్డ్ భూములు కొనుగోలు చేయడం యాక్ట్‌కు విరుద్ధమని.. భూ యాజమాన్య హక్కు కొంత వరకే ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. భూముల్ని కొనుగోలు చేసి పూలింగ్‌కు ఇచ్చినవారు కాకుండా అసలైన అర్హులకు ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read: రాజధానిపై జగన్ ప్రకటన.. పవన్ కీలక నిర్ణయం

ల్యాండ్‌ పూలింగ్‌‌ ప్రకారం టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణానికి భూములు సమీకరించారు. దళితులు, పేదలకు గతంలో మంజూరు చేసిన అసైన్డ్‌ భూములను కొందరు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. తర్వాత సీఆర్డీఏ భూ సమీకరణ కింద సేకరించి బదులుగా వారికి వాణిజ్య, నివాస స్థలాలను కేటాయించింది. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌ (పీవోటీ) 1977 ప్రకారం చట్ట విరుద్ధమంటోంది ప్రభుత్వం.

గత బుధవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ పరిధిలో థర్డ్ పార్టీ భూముల కొనుగోళ్లను రద్దు చేస్తూ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 2500 ఎకరాల అసైన్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ భూములను దక్కించుకున్నారని జగన్ సర్కారు అంటోంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అసెన్డ్ భూముల యాజమాన్య హక్కులు, ల్యాండ్ ఫూలింగ్ ఫలాలు అసలు యజమానులైన దళిత రైతులకు దక్కుతాయి. రిటర్నబుల్ ప్లాట్లను కూడా కేబినెట్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.