యాప్నగరం

‘అమ్మ ఒడి’ దరఖాస్తులు ప్రారంభం.. అర్హత, ఇతర వివరాలకు..

జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకాల్లో అమ్మ ఒడి ఒకటి. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నారు. అమ్మ ఒడి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

Samayam Telugu 3 Nov 2019, 3:28 pm
నవరత్నాల్లో భాగంగా జగన్ సర్కారు అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో అమ్మఒడి ఒకటనే సంగతి తెలిసిందే. ఈ పథకం కింద బడికెళ్లే పిల్లలున్న తల్లికి ఆర్థిక సాయంగా ఏడాదికి రూ.15 వేలు అందజేయనున్నారు. ఈ పథకం విధివిధానాలను ఏపీ కేబినెట్ ఇటీవలే నిర్ణయించింది. ఈ పథకానికి రూ.6450 కోట్ల నిధుల్ని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఒకటో తరగతి నుంచి 12 తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు, సంరక్షకులకు ఈ పథకం వర్తిస్తుంది.
Samayam Telugu amm vodi


అర్హత ఉండి రేషన్ కార్డు లేకపోయినా.. కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారులుగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. జనవరిలో బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ అవుతాయి.

అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే.. పిల్లలు ఒకటి నుంచి 12 తరగతి మధ్య చదువుతుండాలి. ఉండాలి. తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోయినప్పటికీ.. కార్డు కోసం దరఖాస్తు చేసి ఉండాలి. ప్రైవేటు స్కూళ్లలో చదివే వారికి సైతం ఈ పథకం వర్తిస్తుంది.

అమ్మఒడి దరఖాస్తు ఫారం కూడా అందుబాటులోకి వచ్చింది. అర్హులైన వారు వివరాలతో గ్రామ వాలంటీర్‌ను సంప్రదించాలి. అర్హత వివరాలను పూర్తిగా తెలుసుకోవడం కోసం గ్రామ సచివాలయాన్ని సైతం సంప్రదించొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.