యాప్నగరం

ఏపీ నూతన ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రస్తావన లేకుండా జీవో!

ఏపీ ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ విధానంలో భాగంగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది.

Samayam Telugu 22 Aug 2019, 8:03 pm
తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రకటించారు. నవరత్నాల్లో మద్యనిషేధాన్ని చేర్చారు. అధికారంలోకి రాగానే.. బెల్ట్ షాపులు లేకుండా చేసిన జగన్ సర్కారు తాజాగా నూతన ఎక్సైజ్‌ పాలసీని ప్రకటించింది. నూతన విధానం ప్రకారం అక్టోబర్‌ 1 నుంచి మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టనుంది. నూతన మద్యం విధానంలో 800 షాపులను తగ్గించింది.
Samayam Telugu ap liquor policy.


పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతిలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు దార్లో ఎక్కడా మద్యం షాపులు ఉండకుండా నిషేధించింది. అక్టోబర్‌ 1 నుంచి బేవరేజస్ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోనే 3500 మద్యం దుకాణాలను నడపనున్నారు.

కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం.. మద్యం షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే నడుస్తాయని సమాచారం. మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో షాపుల నిర్వహిస్తారు. 150 నుంచి 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో షాపును ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోలో టైమింగ్స్‌కు సంబంధించిన వివరాలేవీ లేకపోవడం గమనార్హం.

గతంలో మద్యం షాపులను సాయంత్రం ఆరు గంటల తర్వాత మూసివేస్తారని ప్రచారం జరిగింది. కానీ దాన్ని రాత్రి 9 గంటల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఇలా చేయడం వల్ల ఇక ఒరిగేది ఏంటని అధికార పార్టీపై వైఎస్ఆర్సీపీ సెటైర్లు వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.