యాప్నగరం

రైతు రుణమాఫీపై హైకోర్టు కీలక ఆదేశాలు.. జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారు?

ఒకేసారి రైతులకు రుణమాఫీకి నిధులు కొరత ఉండటం వల్ల మొత్తం ఐదు దశల్లో మాఫీకి గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, మూడు విడతలను చెల్లించింది. అయితే, చివరి విడతకు నిధులు మంజూరుచేసినా ఎన్నికల కోడ్ వల్ల కుదురలేదు.

Samayam Telugu 31 Aug 2019, 12:39 pm
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం రైతులకు విడతల వారీగా రుణ మాఫీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఒకే విడతలో రుణమాఫీకి నిధులు కొరత ఉండటం వల్ల రైతులకు భరోసా కల్పించేందుకు రుణ ఉపశమన పత్రాలను టీడీపీ ప్రభుత్వం జారీ చేసింది. రుణమాఫీ నిధులు విడుదల చేసినప్పుడు రైతులు ఈ ఉపశమన పత్రాలను సంబంధిత బ్యాంకుల్లో అప్‌లోడ్‌ చేయించుకుని, మాఫీ సొమ్మును ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు, ఐదు విడతలకు సంబంధించి మార్చి 10న గత ప్రభుత్వం జీవో జారీచేసింది. ఇదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రైతులకు రుణమాఫీ నిలిచిపోయింది.
Samayam Telugu andhra-High-court


Read Also: మూడు దశల్లో వాటర్ గ్రిడ్: ఆ జిల్లాలకే తొలి ప్రాధాన్యత.. జగన్ కీలక ఆదేశాలు!


తర్వాత ప్రభుత్వం మారడంతో రుణ మాఫీపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన రుణ ఉపశమన పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం మార్చి 10న జారీచేసిన జీవో 38ను అమలుచేయాలని కోరుతూ ఏపీ కాంగ్రెస్ కమిటీ కిసాన్ సెల్ ఛైర్మన్ జెట్టి గురునాథరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ సి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక ఆదేశాలు వెలువరించింది.

Read Also: ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో సీబీఐ ఆకస్మిక దాడులు

గత ప్రభుత్వం మార్చి 10న జారీచేసిన జీవో 38 ప్రకారం రైతు రుణమాఫీకి సంబంధించిన పథకం ఇప్పటికీ అమల్లో ఉంటే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. ఆ పథకం అమల్లో ఉంటే నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలియజేయడంతో ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.

Read Also: సొంత జిల్లా సమస్యపై జగన్ ఫోకస్.. అధ్యయన కమిటీ నియామకం

4, 5 విడతల రుణమాఫీ సొమ్ము వడ్డీతో కలిపి రూ.8,300 కోట్లు విడుదల చేస్తూ మార్చి 10న జీవో 38ని జారీ చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని 31.44 లక్షల రైతుల ఖాతాలకు జమ చేయాలని అందులో పేర్కొన్నారు. మార్చిలో నాలుగో విడత, ఏప్రిల్ మొదటి వారంలో 5వ విడత సొమ్ము కింద రైతుల ఖాతాలకు జమ చేయాలని అందులో వివరించారు. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో రుణమాఫీ నిలిచిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.