యాప్నగరం

అసలు డబ్బులెలా ఇస్తారు.. వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

గతంలో మీడియాలో వచ్చిన కథనాలను ప్రస్తావించిన ఏపీ హైకోర్టు. ఒకవేళ వాలంటీర్ తప్పుచేస్తే ఎవరు శిక్షిస్తారని.. అసలు పథకాలకు లబ్ధిదారుల్ని వాలంటీర్లు ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించింది.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 6 May 2022, 5:34 pm

ప్రధానాంశాలు:

  • రాజకీయ కక్షతో పథకాలు నిలిపివేశారని పిటిషన్
  • సీరియస్ కామెంట్స్ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
  • ప్రభుత్వం, ఏడుగురు వాలంటీర్లకు నోటీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాలంటీర్‌ అంటే స్వచ్ఛందం.. డబ్బులెలా ఇస్తారు అని ప్రశ్నించింది. పింఛన్ సొమ్ముతో వాలంటీర్‌ పరారీ.. అలాగే శ్రీకాకుళంలో జరిగిన ఘటనలపై మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు జడ్జి జస్టిస్ దేవానంద్‌ ప్రస్తావించారు. వాలంటీర్‌ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని కోర్టు ప్రశ్నించింది. లబ్ధిదారుడిని వాలంటీర్లు ఎంపిక చేయడమేంటని.. సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. ఏడుగురు వాలంటీర్లకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులకు రాజకీయకక్షతో వైఎస్‌ఆర్‌ చేయూత పథకం నిలిపివేయడంపై గారపాడుకు చెందిన 26 మంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపగా.. లాయర్ వాదనలు వినిపించారు.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.