యాప్నగరం

ఏపీ: ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!

ఏపీ ప్రజల్ని అప్రమత్తం చేసిన విపత్తుల నిర్వహణశాఖ. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాలను అలర్ట్ చేసిన అధికారులు. మరోవైపు 24 గంటల పాటూ ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 5 May 2022, 4:54 pm

ప్రధానాంశాలు:

  • ఏపీ ప్రజల్ని అమప్రత్తం చేసిన అధికారులు
  • నాలుగు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ఏపీ ప్రజలకు అలర్ట్
ఏపీలో పిడుగులుపడతాయని హెచ్చరించింది విపత్తుల నిర్వహణశాఖ. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు పిడుగు హెచ్చరిక జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, సర్వకోట, హీరా మండలం, లక్ష్మీనర్సుపేట.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి. మాడుగుల, చింతపల్లె, రాజవొమ్మంగి, జికె వీధి, కొయ్యురు, పాడేరు, డుంబ్రిగూడ, హుకుంపేట ప్రాంతాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది.
అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లి, చీడికాడ, నాతవరం, గొలుగొండ, మాడుగుల.. విజయనగరం జిల్లా వేపాడ, శృంగవరపుకోట, గంట్యాడ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు,వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరించారు.
మరోవైపు 24 గంటల పాటూ వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది వాతావారణ శాఖ. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వాన పడుతుందని తెలిపింది. శుక్రవారం నాటికి దక్షిణ అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. రెండ్రోజుల్లో వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయి. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు రెండు రోజులుగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు జిల్లాలో వర్షాలు కురిశాయి, పిడుగులు పడ్డాయి.
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.