యాప్నగరం

ఏపీ ప్రజలకు అలర్ట్: 2 రోజుల్లో 165 మండలాల్లో వడగాడ్పులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వాతావరణ వివరాలను ట్వీట్ చేసింది. రాబోయే రెండు రోజుల్లో 165 మండలల్లాలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

Authored byసత్యానందం గుండెమాడుగుల | Samayam Telugu 19 Apr 2023, 7:38 pm
భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనాల ప్రకారం గురువారం 125 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం 40 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్లడించారు. విపత్తుల సంస్థ నుంచి వడగాల్పుల హెచ్చరిక మెసెజ్ అందినప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ బుధవారం ట్వీట్ చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


గురువారం మన్యం జిల్లా కొమరాడ, పార్వతీపురం కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తీవ్రవడగాల్పు వీచే అవకాశం ఉందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.


ఇక, ఐఎండీ అంచనా ప్రకారం దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారం (22-04-2023) ఉత్తరాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం ఉత్తరాంధ్ర, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచించారు.


వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు ఇవే..
అల్లూరి జిల్లా: 7
అనకాపల్లి:15
తూర్పు గోదావరి: 4
ఏలూరు: 2
గుంటూరు: 11
కాకినాడ: 10
కృష్ణా: 4
ఎన్టీఆర్: 12
పల్నాడు: 5
మన్యం: 11
శ్రీకాకుళం: 13
విశాఖపట్నం: 2
విజయనగరం: 23,
వైఎస్సార్ జిల్లాలోని 6 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇక, బుధవారం అనకాపల్లి జిల్లాలో 8, విజయనగరం ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచాయి. మరో 93 మండలాల్లో వడగాల్పులు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
రచయిత గురించి
సత్యానందం గుండెమాడుగుల
సత్యానందం గుండెమడుగుల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. సత్యానందంకు పాత్రికేయ రంగంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలో సెంట్రల్ డెస్క్‌లో పని చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.