యాప్నగరం

ఏపీలో భారీ వర్షాలు.. ఈ 5 జిల్లాలకు తీవ్ర హెచ్చరిక.. బీ అలర్ట్!!

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Samayam Telugu 21 Jul 2021, 4:31 pm
ఆంధ్రప్రదేశ్ వర్షాల జోరు ఊపందుకుంటోంది. రుతుపవనాల రాకతో పల్లెలన్నీ వర్షపు చినుకుల్లో తడిసి ముద్దవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని బుధవారం అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లో ఇది ఏర్పడొచ్చని తెలిపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాబట్టి, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది.

ఇక, ఈ అల్పపీడన ప్రభావం ముఖ్యంగా 5 జిల్లాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనం కారణంగా కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.