యాప్నగరం

అన్నవరంలో కరోనా కల్లోలం.. దర్శనాలు బంద్

అన్నవరంలో కూడా కరోనా కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. దేవస్థానం సిబ్బందిలో ఇప్పటికే 50మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దర్శనాల్ని ఈనెల 23వరకు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Samayam Telugu 13 Aug 2020, 9:38 am
ఏపీలో కరోనా విజ‌‌ృంభణ కొనసాగుతోంది. ప్రతీ రోజూ వేలల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ప్రముఖ దేవస్థానం అన్నవరం ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో దర్శనాలను ఆగస్టు 23 వరకు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో త్రినాథరావు తెలిపారు.
Samayam Telugu అన్నవరం ఆలయం
annavaram temple


ఇటీవల దేవస్థానం సిబ్బందిలో 650 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 50 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఈ నెల 9 నుంచి 14 వరకు ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ స్వామివారికి దర్శనం కోసం రావద్దని కోరారు. . ఈ నెల 11న మరో 250 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. రెండ్రోజుల్లో మరో 200 మందికి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 23 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. వ్రతాలు, కల్యాణం, చండీ, ఆయుష్య హోమాలు, త్రికాల మొదలైన పూజలన్నీ స్వామివారికి ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.
Read More: దగ్గుబాటి అభిరామ్ కారు ప్రమాదం.. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు
మరోవైపు ఏపీలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. 57,148 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 9,597 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,54,146కు చేరింది. బుధవారం అధికారిక లెక్కల ప్రకారం ఏకంగా 93 మంది కరోనా బారినపడి మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 2,296కు పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.