యాప్నగరం

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. తెల్ల రేషన్ కార్డు దరఖాస్తుకు మరో అవకాశం, వివరాలు ఇవే

తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం మరో అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించిన డిప్యూటీ సీఎం అంజాద్ భాషా. పూర్తి వివరాలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

Samayam Telugu 8 Oct 2020, 7:07 am
ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నవశకం సర్వే ద్వారా తెల్ల రేషన్‌కార్డు కోల్పోయిన లబ్ధిదారులు మరలా కార్డు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగి, ఆదాయపన్ను చెల్లింపు, పరిమితికి మించి సొంత భూమి, అధిక విద్యుత్తు వినియోగం, ఇతర కారణాలతో తెల్ల రేషన్‌కార్డుకు అనర్హులైన వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Samayam Telugu తెల్ల రేషన్ కార్డు


తెల్ల రేషన్ కార్డులు పొందేందుకు ఇదివరకు అనర్హత కలిగిన కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, సదరు కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును రేషన్ కార్డు దరఖాస్తుతో జతచేసి తమ సమీపంలోని గ్రామ-వార్డు సచివాలయాల్లో సమర్పించాలి. సంబంధిత గ్రామ-వార్డ్ సచివాలయ సిబ్బంది పరిశీలించి.. ఇదివరకు అనర్హత పొందిన వారు మరల తెల్ల రేషన్ కార్డుకు అర్హత పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వ సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.