యాప్నగరం

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు

విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో ఈ ప్రమాదం జరిగింది.

Samayam Telugu 27 Jul 2020, 5:39 pm
విశాఖపట్నంలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో ఈ ప్రమాదం జరిగింది. స్థానిక విమానాశ్రయం సమీపంలోని షీలానగర్ కంటైనర్ యార్డులో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో ఎల్లపువాని పాలెం ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.

హానికర రసాయనం ద్వారా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. కాగా, విశాఖపట్నంలో వరుస ప్రమాదాలు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో 12 మందికి మరణించగా, కనీసం 10 వేల మందికి పైగా దీని ప్రభావం ఎదుర్కొన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే విశాఖలోని సాయినార్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. హైడ్రోజన్ సల్ఫైడ్ లీక్ కావడంతో దీని గాఢత వల్లే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

అలాగే ఇటీవలే విశాఖ రాంకీ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఒకరు సజీవదహనమయ్యారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే విశాఖ గేట్ వే కంటైనర్‌లో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. విశాఖపట్నంకు రాష్ట్ర పరిపాలనా రాజధాని తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న తరుణంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.