యాప్నగరం

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ శుభవార్త.. వారికి మాత్రమే!

AP Aided Govt Employees Retirement Age పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో సవరణ బిల్లును కూడా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 20 Mar 2023, 7:19 am

ప్రధానాంశాలు:

  • ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థల సిబ్బందికు శుభవార్త
  • పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం
  • అసెంబ్లీలో బిల్లను కూడా ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AP Aided Colleges Employees Retirement Age
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసును ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం 60 ఏళ్లకు ఉన్న 62 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ విద్యాహక్కు చట్టం 1982 సవరణ బిల్లును ప్రభుత్వం ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ గ్రంథాలయాల చట్టం 1962 సవరణ బిల్లు ద్వారా.. జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచేలా కూడా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశ పెట్టారు. 2022 జవనరి 1 నుంచి 2022 నవంబరు 29 మధ్య అరవై సంవత్సరాలు నిండి, సర్వీసు నుంచి పదవీ విరమణ చేసిన గ్రంథాలయ సంస్థల ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. గతంలోనే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.